The NDA govt is once again clarify on aps special status issue. The ruling YCP and opposition TDP are demanding special status to state. Once again, the NDA, which is in power at the Center, we want give ant state to special status
#AP
#specialstatus
#centralgovt
#loksabha
#nirmalasitharaman
#answer
#YCP
#TDP
ఆంధ్రప్రదేశ్ ఆశలపై ఎన్డీఏ సర్కార్ మరోసారి నీళ్లు చల్లింది. కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని అధికార వైసీపీ, విపక్ష టీడీపీ కొరుతున్నాయి. మరోసారి కేంద్రంలో అధికారం చేపట్టిన ఎన్డీఏ స్పెషల్ స్టేటస్ ఇచ్చేది లేదని తేల్చిచెప్పింది. ఏపీకి ఇస్తే .. మరో 7 రాష్ట్రాలకు ఇవ్వాల్సి వస్తున్నందున .. ఏ రాష్ట్రానికి ఇవ్వబోమని స్పష్టంచేసింది.ప్రత్యేక హోదాపై బీహర్ ఎంపీ కౌశలేంద్ర కుమార్ అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. దేశంలో ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వబోమని తేల్చిచెప్పారు. ఏపీ ప్రత్యేక హోదా అడిగితే .. తెలంగాణ, ఒడిశా, రాజస్థాన్, ఛత్తీస్ గఢ్, బీహర్ సహా 7 రాష్ట్రాలకు ఇవ్వాల్సి వస్తోందని చెప్పకనే చెప్పారు. ఆ రాష్ట్రాల నుంచి కూడా వినతులు వస్తున్నాయని మంత్రి పేర్కొన్నారు. అలాగే పరిశ్రమలకు ప్రత్యేక రాయితీలు .. హోదాకు సంబంధం లేదని స్పష్టంచేశారు. ఆయా రాష్ట్రాల ఆర్థిక పరిస్థితిని బట్టి పరిశ్రమలకు రాయితీలు ఇస్తామని .. కానీ దానిని ప్రత్యేక హోదాతో ముడిపెట్ొద్దని తేల్చిచెప్పారు.